మనోరంజని ప్రతినిధి కుబీర్ మార్చి 13 :- నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని పల్సి గ్రామంలో ఉన్న విద్యా భారతి పాఠశాలలో గురువారం ముందస్తు హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు రంగులు చల్లుకుంటూ ఉత్సాహంగా హోలీ పండుగను జరుపుకున్నారు. విద్యార్థులు విన్యాసాలు , కేరింతలు చూపరులను అబ్బురపర్చాయి. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గంగాసింగ్ మాట్లాడుతూ, "హోలీ పండుగ స్నేహం, ఐక్యతకు ప్రతీక" అని చెప్పారు. విద్యార్థులకు, తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ పోతన్న, భోజన్న, కొట్టే రామకృష్ణ, మధుసూదన్, సాయినాథ్ దేవకి, కవిత, రాణి, శ్రావణి, వైష్ణవి, నేహ, గంగామణి, శృతిక, నందిని, పద్మ సహా అనేక మంది విద్యార్థులు, పాల్గొన్నారు