

విద్యార్థుల నీటి కోరతను తీర్చిన మాజీ ఎంపీపీ చంద్రకాంత్ యాదవ్
మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 21 :- నిర్మల్ జిల్లా తానూర్ మండలంలోని బోర్గావ్ పాఠశాలలో విద్యార్థులు నీటి కొరతతో ఇబ్బంది పడుతున్న విషయాన్ని తెలుసుకున్న మాజీ ఎంపీపీ చంద్రకాంత్ యాదవ్, వేసవి సెలవులు ముగిసే వరకు విద్యార్థులకు తన తరఫున మంచి నీరు అందించనున్నట్లు ప్రకటించారు.ఈ సందర్భంగా విద్యార్థి మల్లేష్ మాట్లాడుతూ, “విద్యార్థుల ఇబ్బందిని గుర్తించి మాజీ ఎంపీపీ చంద్రకాంత్ తాగునీరు అందించినందుకు మా తరఫున కృతజ్ఞతలు,” అని తెలిపారు. ఈ నీరు ఉమ్రి కె గ్రామ మాజీ సర్పంచ్ మారుతి పటేల్ గారి సహకారంతో జీపి వర్కర్ ద్వారా సరఫరా చేయబడుతుందని పేర్కొన్నారు. బోర్గావ్ గ్రామ ప్రజలు వారి సహాయ సహకారానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.