

మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 22 :- వేసవికాలంలో మండుటెండలో తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. నిర్మల్ జిల్లా తానుర్ మండలంలోని బెంబర్ గ్రామంలో తాగునీటితో ప్రజలు కష్టాలు పడుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. పాఠశాలల్లో విద్యార్థులకు తాగునీరు ఇబ్బందులు గురవుతున్నారు. సమాచారం అందుకున్న అదే గ్రామానికి చెందిన వి.సాయినాథ్ వెంటనే స్పదించి, వేసవికాలం సెలవులు వరకు విద్యార్థులకు ఉచితంగా తాగునీరు అందిస్తానని ముందుకు వచ్చారు. పాఠశాలలో ఇతర సమస్యలు ఏదైనా ఉంటే తనవంతు పరిష్కారం అందిస్తానని భరోసా ఇచ్చారు. విద్యార్థులకు ఉచితంగా తాగునీరు గ్రామ కార్యదర్శి జయశ్రీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వి సాయినాథ్ విద్యార్థులకు తాగునీరు అందించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు దృష్టికి తీస్కవెళ్లి సమస్యను పరిష్కరించేందుకు తనవంతు కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.