

విద్యార్థులు శాస్త్రీయ దృక్పథం అలవర్చుకోవాలి
రచయిత గోస్కుల సత్యనారాయణ
ఆదిలాబాద్, జిల్లా కేంద్రానికి చెందిన గోస్కుల సత్యనారాయణ స్వయంగా సంకలనం చేసి భారతీయ మరియు పాశ్చాత్య శాస్త్రవేత్తలు అనే పుస్తకాన్ని విద్యార్థులకు శాస్త్రీయ దృక్పధం అభివృద్ధి చేయలనే ఉద్దేశంతో రూపకల్పనం చేశారు. ఈ సందర్బంగా ప్రాథమికోన్నత పాఠశాల, జామిని తరుపున ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఘనంగా సన్మానం చేశారు. జామిని పాఠశాలకు భారతీయ మరియు పాశ్చాత్య శాస్త్రవేత్తలు అనే పుస్తకాలను స్కూల్ లైబ్రరీకి అందజేశారు. సంకలన సంపుటి రచయిత కృషిని అభినందనలు తెలియజేశారు. సంకలన సంపుటి సృష్టి కర్త గోస్కుల సత్యనారాయణ మాట్లాడుతు నేను తెలంగాణ మోడల్ స్కూల్, జైనథ్ లో పిజిటి గా విధులు నిర్వహిస్తున్ననాని, ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని తాటిగూడ అని ప్రస్తుతం ఆర్ ఆర్ నగర్ లో నివాసం ఉంటూన్నమని తెలియజేశారు. ప్రభుత్వ అన్ని పాఠశాలల లైబ్రరీలో భారతీయ మరియు పాశ్చాత్య శాస్త్రవేత్తలు అనే పుస్తకాలను స్వచ్చందంగా అందజేయడానికి ప్రయత్నం చేస్తున్నాను అని అన్నారు. భారతీయ మరియు పాశ్చాత్య శాస్త్రవేత్తలు అనే పుస్తకంలో శాస్త్రవేత్తల జీవిత చరిత్రలను, వారి వారి జీవిత సంఘర్షణలను, వారి ఆవిష్కరణలను తదితర అంశాలను పొందపరిచాను అని అన్నారు. ఈ పుస్తకం ద్వారా విద్యార్థులు శాస్త్రవేత్తల జీవితాల నుండి అనేక శాస్త్రీయ సంబంధిత విషయాలను విద్యార్థులు నేర్చుకునే అంశాలు ఉన్నాయని అన్నారు. భారతీయ మరియు పాశ్చాత్య శాస్త్రవేత్తలు అనే పుస్తకం పాఠకులలో ముఖ్యంగా విద్యార్థులలో విజ్ఞానాన్ని మరియు స్పూర్తిని నింపే ప్రయత్నం చేశాను అని అన్నారు.
ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శరత్ కుమార్ యాదవ్, జ్యోతి, జయశ్రీ, లక్ష్మణ్, దుస గంగన్న, పెంటపర్తి ఊశన్న, మూనాహిద్, అనుసూయ, పోచ్చిరాం తదితరులు పాల్గొన్నారు
