విద్యార్థులు ,యువత చదువుతో పాటు క్రీడల్లోనూ ఉత్తమ ప్రతిభ కనబర్చి జీవితంలో ఉన్నతంగా రాణించాలి
: బేల మండలం దహెగాం గ్రామంలో క్రికెట్ పోటీల ఫైనల్ మ్యాచ్ కుముఖ్య అతిధిగా హాజరై ట్రోఫీలను అందించిన బోరంచు శ్రీకాంత్ రెడ్డి
యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించి ఉన్నత భవిష్యత్తును పొందాలని తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి పిలుపునిచ్చారు. బేల మండలంలోని దహెగాం గ్రామంలో తిరంగా క్రికెట్ క్లబ్ దహెగాం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రీడాపోటీలకు ముఖ్య అతిధిగా హాజరై ప్రారంభించారు. ఫైనల్ మ్యాచ్ నేడు నిర్వహించగా క్రీడాకారులను పరిచయం చేసుకుని టాస్ వేసి మ్యాచ్ ని ప్రారంభించి పాల్గొంటున్న జట్టులు ఇరువురికి ఆల్ డి బెస్ట్ తెలిపారు. అనంతరం మ్యాచ్ లో గెలుపొందిన జట్టుకు, రన్నరప్ గా నిలిచిన జట్లకు ట్రోఫీలను, ప్రైజ్ లను అందజేసి వారిని అభినందించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు శ్రీకాంత్ రెడ్డి గారిని శాలువాతో ఘనంగా సన్మానించడం జరిగింది.
ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ క్రీడా పోటీల్లో పాల్గొనడం వల్ల స్నేహభావం పెంపొందుతుందని అన్నారు. ప్రతినిత్యం ఏదో ఒక క్రీడలో పాల్గొనడం ద్వారా శారీరక ధారుడ్యంతో పాటు మానసిక ఉల్లాసం పెంపొందుతాయని అన్నారు. నిజ జీవితంలో సమిష్టి కృషి తోనే విజయాలను సులువుగా చేరుకోగలమనే దానికి ఉదాహరణ క్రీడలని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం క్రీడలకు ఎంతో ప్రాధాన్యత నిస్తూ యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ నెలకొల్పేందుకు కృషి చేస్తోందని అన్నారు. క్రికెట్ పై మక్కువతో ఎంతో మంది జిల్లా నుండి రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో సైతం ప్రతిభ కనబర్చడం జరిగిందన్నారు. నిజ జీవితంలో సమిష్టి కృషి తోనే విజయాలను సులువుగా చేరుకోగలమనే దానికి ఉదాహరణ క్రీడలని, క్రీడలు ఎవరి జీవితంలో వారికి తీపి గుర్తుగా మిగిలిపోతాయని, క్రీడాకారులు ప్రతి ఒక్కరు గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలని,అదే స్ఫూర్తిని నిజ జీవితంలో అలవర్చుకోవాలని శ్రీకాంత్ రెడ్డి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బేల మాజీ zptc రాందాస్ నక్లే, బేల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఫయాజుల్లా ఖాన్, మాజీ చైర్మన్ వామన్ వాంఖడే, మాజీ ఎంపీపీ బేల బాపురావ్ హల్కే, మాజీ సర్పంచ్ రూపారావ్ వాంఖడే, మార్కెట్ డైరెక్టర్ చంద్రకాంత్ మడావి, దహెగావ్ పార్టీ నేత భోక్రే శంకర్ ,యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గోడే అవినాష్ ,సాగర్ ఠాక్రే , హేమంత్ సవాపురే, భాస్కర్ ఖడ్సే , సోహన్ ఖడ్సే , స్వప్నిల్ చవాన్ , గులాబ్ చవాన్ ,విజయ్ డార్నే , ప్రమోద్ భోయార్ , చంద్రకాంత్ భోయార్ , గణేష్ వాంఖడే , వైభవ్ , మున్నా భాయ్, గంభీర్ ఠాక్రే తదితరులు పాల్గొన్నారు.