విద్యార్థి దశ నుండే పిల్లలలో ఆర్థిక అవగాహన కలిగి ఉండాలి

విద్యార్థి దశ నుండే పిల్లలలో ఆర్థిక అవగాహన కలిగి ఉండాలి

లీడ్ బ్యాంకు మేనేజర్ రామ్ గోపాల్

మనోరంజని ప్రతినిది నిర్మల్ మార్చి 06 :- విద్యార్థి దశనుండే పిల్లలకు ఆర్థిక విషయాలపై అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉందని లీడ్ బ్యాంకు మేనేజర్ రామ్ గోపాల్ తెలిపారు. జిల్లా యంత్రాంగం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బాలశక్తి కార్యక్రమంలో భాగంగా కేజీబీవీ దస్తురాబాద్ పాఠశాలల్లోని విద్యార్థులకు ఆర్థిక అక్షరాస్యత సైబర్ సెక్యూరిటీ పై క్విజ్ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా రామ్ గోపాల్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో నివసించే తల్లిదండ్రులకు డబ్బు విషయంపై పొదుపు,పెట్టుబడి,బాధ్యత,దుబారా ఖర్చులు చేయకుండా ముందటి నుండే అవగాహన కల్పించాలని ఆయన తెలిపారు.అదేవిధంగా చిన్నప్పటినుండి పిల్లలకు డబ్బుపై అవగాహన కల్పించినట్లయితే భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు వహిస్తారని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు తిరుపతి,ఉపాధ్యాయులు,సి ఎఫ్ ఎల్ వాలంటీర్ ప్రశాంత్,పాఠశాల విద్యార్థులు,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

  • Related Posts

    ప్రభుత్వ హాస్టళ్ళలో విద్యార్థినీల ప్రతిభను వెలికితీసేందుకే యువ ఉత్సవ్

    ప్రభుత్వ హాస్టళ్ళలో విద్యార్థినీల ప్రతిభను వెలికితీసేందుకే యువ ఉత్సవ్ ఆకట్టుకున్న సైన్స్ ఎగ్జిబిషన్, ఫోటో గ్యాలరీ, సాంస్క్రతిక కార్యక్రమాలు ప్రభుత్వ హాస్టళ్ళలో ఉంటూ విద్యనభ్యసిస్తున్న విద్యార్థినీ విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు నెహ్రు యువ కేంద్రం ఆధ్వర్యంలోయువ ఉత్సవ్…

    ఒత్తిడిని అధిగమించి విజయాన్ని సాధించాలి

    ఒత్తిడిని అధిగమించి విజయాన్ని సాధించాలి నిర్మల్ జిల్లా భైంసా మండలం వనాల్పడ్ గ్రామం లో స్థానిక ప్రభుత్వ వానాల్పడ్ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆనందిత ఫౌండేషన్ చైర్మన్,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    బీటెక్ ఫలితాలలో శ్రీ చైతన్య ప్రభంజనం

    బీటెక్ ఫలితాలలో శ్రీ చైతన్య ప్రభంజనం

    ప్రభుత్వ హాస్టళ్ళలో విద్యార్థినీల ప్రతిభను వెలికితీసేందుకే యువ ఉత్సవ్

    ప్రభుత్వ హాస్టళ్ళలో విద్యార్థినీల ప్రతిభను వెలికితీసేందుకే యువ ఉత్సవ్

    ఒత్తిడిని అధిగమించి విజయాన్ని సాధించాలి

    ఒత్తిడిని అధిగమించి విజయాన్ని సాధించాలి