

విద్యార్థికి పరీక్ష కేంద్రంలో దించిన ముధోల్ ఎస్సై
మనిరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 05 :- నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రంలో ఇంటర్ పరీక్షల నేపథ్యంలో ఉ.8 నుంచే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. ఓ విద్యార్థి మాత్రం ప్రభుత్వ జూనియర్ కాలేజ్లోని కేంద్రంలో పరీక్ష రాయాల్సి ఉండగా పొరపాటున గురుకుల కాలేజ్లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రానికి వచ్చాడు. పరీక్ష కేంద్రం ఇక్కడ కాదని తెలియడంతో పరుగులు పెట్టాడు. అక్కడే ఉన్న ముధోల్ ఎస్ఐ సంజీవ్ కుమార్ గమనించి ఆ విద్యార్థిని పోలీసు వాహనంలో పరీక్ష కేంద్రానికి సమయానికి చేర్చి పరీక్ష రాసేలా చేశారు. ఎస్సై సకాలంలో స్పందించి పరీక్షా కేంద్రంలో విద్యార్థిని దించడంతోనే సంవత్సర కాలం పాటు చదివిన విద్యార్థి పరీక్ష రాయగలిగాడు. దింతో పలువురు ఎస్ఐ ను స్థానిక నాయకులు, యువకులు అభినందించారు.