

విద్యాభివృద్ధికి ప్రభుత్వం కృషి
విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి ఇంటిగ్రేటెడ్ స్కూల్లో ఏర్పాటు
చొప్పదండి నియోజకవర్గం లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి రూ. 200 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పురుమళ్ళ మనోహర్
గంగాధర మండలం మధురానగర్ చౌరస్తాలో మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు
మనోరంజని ప్రతినిధి గంగాధర మార్చి 10 :- తెలంగాణ రాష్ట్రంలో విద్యాభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం కృషి చేస్తుందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పురుమళ్ళ మనోహర్ అన్నారు. చొప్పదండి నియోజకవర్గం లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి ప్రభుత్వం రూ. 200 కోట్లు మంజూరు చేసిన సందర్భంగా సోమవారం గంగాధర మండలం మధురానగర్ చౌరస్తాలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం చిత్రపటాలకు పాలాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ గత బిఆర్ఎస్ ప్రభుత్వం విద్యావ్యవస్థను నిర్వీర్యం చేసిందని గుర్తు చేశారు. రాష్ట్రంలోని విద్యార్థులందరికీ నాణ్యమైన విద్యను అందించడానికి సర్కారు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ళను ఏర్పాటు చేస్తోందని తెలిపారు. చొప్పదండి నియోజకవర్గం లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇందుకు కృషిచేసిన చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం కు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో దుబ్బాసి బుచ్చయ్య,జాగిరపు శ్రీనివాస్ రెడ్డి, వేముల భాస్కర్,తోట సంధ్యా కరుణాకర్ ,బుర్గు గంగన్న, సత్తు కనుకయ్య, వంగళ పరంధాములు, దోర్నాల శ్రీనివాసరెడ్డి,పడ్నాల రాజన్న, గుజ్జుల బాపు రెడ్డి,గరిగంటి కరుణాకర్, పెంచాల చందు, బొడ్డు మహేష్,అట్లా రాజశేఖరరెడ్డి , వేముల అంజి, గంగాధర సుదర్శన్, మ్యాక వినోద్, మంత్రి మహేందర్, రాజు,తదితరులు పాల్గొన్నారు
