

విడుదల రజనీ ఆమె మరిది గోపి పై… మరో కేసు రెడీ
వైసీపీ నేత మాజీ మంత్రి విడుదల రజిని కష్టాలు రోజురోజుకు రెట్టింపు అవుతున్నాయి. ఇటీవల స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించిన వ్యవహారంలో ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం రాజకీయంగా పెద్ద ఎత్తున సంచలనంగా మారింది.
రజనీపై నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు ఢిల్లీ వేదికగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారం ఇక్కడితో ఆగదని తాను ముందుకు తీసుకువెళ్తానంటూ లావు కృష్ణదేవరాయులు విడుదల రజనీకి వార్నింగ్ ఇచ్చారు.
స్టోన్ క్రషర్ యజమాని నుంచి ఆమె రెండు కోట్ల రూపాయలు రాత్రి 11 గంటల సమయంలో తీసుకున్నట్లుగా సాక్షాలను కూడా పోలీసులు సేకరించారు. వాటి ఆధారంగానే గవర్నర్ అనుమతితో ఆమెపై కేసు నమోదయింది. ఇక తాజాగా ఆమె మరిది గోపి వ్యవహారం మరోసారి రజనీకి తలనొప్పిగా మారే అవకాశాలు కనబడుతున్నాయి. తాజాగా రజిని ఆమె మరిది గోపి పై జిల్లా ఎస్పీకి ఒక ఫిర్యాదు చేశారు.
చిలకలూరిపేట నియోజకవర్గానికి చెందిన నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం వీరిపై ఎస్పీకి ఫిర్యాదు చేశారు. 2022 ఏప్రిల్ లో రజనీ అక్రమాలను తాను ప్రశ్నించినందుకు తన ఇంటిపై ఆమె దాడి చేయించారని అందులో ప్రస్తావించారు.
దాదాపు 100 మంది వచ్చి తనపై దాడి చేశారని తన కారుని ఇంట్లో ఫర్నిచర్ ని నాశనం చేశారని అలాగే మూడు రోజులపాటు విధ్వంసం సృష్టించి తనను తన కుటుంబ సభ్యులను చిత్రహింసల గురి చేశారని సుబ్రహ్మణ్యం ఫిర్యాదులో పేర్కొన్నారు. అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేసిన సరే పట్టించుకోలేదని నామమాత్రంగా కేసు నమోదు చేసినట్టు ఆయన ఎస్పీకి ఫిర్యాదు చేశారు. రజనీపై ఆమె మరిదిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఎఫ్ఐఆర్ లో వారిద్దరి పేర్లు చేర్చాలని కోరారు.