

విడదల రజనీపై కేసుకు గవర్నర్ అనుమతి?
మనోరంజని :ప్రతినిధి చిలకలూరిపేట. చిలుకలూరిపేట మాజీ ఎమ్మెల్యే .. విడదల రజని మంత్రిగా ఉండి చేసి అవినీతి, అక్రమాల విషయంలో చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో చట్టబద్ధంగా వ్యవహరిస్తోంది. మాజీ మంత్రి కావడం.. పదవిలో ఉన్నప్పుడు చేసిన అక్రమాలపై కేసులు పెట్టడం వల్ల సెక్షన్ 17A కింద గవర్నర్ అనుమతి తప్పనిసరి. ఇప్పటికే అన్ని ఆధారాలు ఉండటంతో కేసు నమోదుకు ఏసీబీ సీఎస్ అనుమతి తీసుకుంది. ఇప్పుడు గవర్నర్ కు కూడా అనుమతి కోసం లేఖ సమర్పించారు. విడదల రజని పై చేసిన ప్రాథమిక దర్యాప్తు, ఆధారాలను కూడా రాజ్ భవన్‌కు ఏసీబీ సమర్పించినట్లుగా తెలుస్తోంది.