

నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలో అడెల్లి రోడ్‌లోని వింధ్య యూపీ పాఠశాలలో పేవరెల్ పార్టీ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సారంగాపూర్ మాజీ జడ్పీటీసీ సభ్యులు పత్తి రెడ్డి రాజేశ్వర్ రెడ్డి, పద్మనాథ గౌడ్, సాయన్న యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. విద్యార్థులకు చదువు మాత్రమే కాకుండా ఆటలు, పాటలు, క్రీడల్లో కూడా ముందుండాలని సూచించారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ వేడుకలో పాఠశాల కరస్పాండెంట్ రమేష్, ప్రిన్సిపాల్ కుర్ర నవీన్, దశరథ్ రాజేశ్వర్, మాజీ ఎంపీపీ అట్లా మహిపాల్ రెడ్డి, మాజీ స్వర్ణ ప్రాజెక్టు ఓలత్రి నారాయణ రెడ్డి, సారంగాపూర్ మాజీ సర్పంచ్ దేవి శంకర్, సాక్ పెళ్లి సురేందర్, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.