

వాహనాల తనిఖీల్లో మహిళ బ్లూ
కోర్డ్ పోలీసులు
మనోరంజని ప్రతినిధి కుంటాల మార్చి 06 :- జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల ఆదేశాల మేరకు మహిళ బ్లూ కోర్డ్ పోలీసు లు గురువారం ముమ్మరంగా వాహనా లను తనిఖీ చేశారు. నిర్మల్ జిల్లా కుంటాల మండల కేంద్రమైన రోడ్డుపై వానాలను తనిఖీలు చేయడం జరిగిందని డబ్ల్యూపీసీ రసవిత, అశ్విని తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎస్పీ సూచనల మేరకు మహిళా పోలీసులు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించడం కాకుండా వాహనాల తనిఖీ లను నిర్వహిస్తున్నామన్నారు. ద్విచక్ర వాహనా దారులు తప్పనిసరిగా లైసెన్స్ హెల్మెట్ ను ధరించి ఉండాలన్నారు. తనిఖీల్లో చేసి సరైన పత్రాలు లేని వాహనాలకు జరిమానాలు విధించినట్లు పేర్కొన్నారు. ఈ వాహనాల తనిఖీల్లో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
