

మనోరంజని ప్రతినిధి నిర్మల్ మార్చి 13 :- నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆదర్శ్ నగర్‌లో ఉన్న వశిష్ట ఇంపల్స్ ఈ టెక్నో స్కూల్‌లో గురువారం ముందస్తు హోలీ పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. విద్యార్థులు రంగులతో ఒకరిపై ఒకరు చల్లుకుంటూ పండుగ ఆనందాన్ని పంచుకున్నారు.ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ గొల్లపల్లి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, “హోలీ పండుగ సామాజిక ఐక్యతకు ప్రతీక” అని పేర్కొన్నారు. పూజలతో కాకుండా రంగులతో ఆనందం పంచుకోవడం ఈ పండుగ ప్రత్యేకత అని తెలిపారు. హోలీ పండుగ పురాణ కధలతో ముడిపడి ఉందని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ గొల్లపల్లి మాధవి, అకాడమిక్ డైరెక్టర్ దేవిదాస్ గార్లు సహా పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు
