

వచ్చే నెలలో ముహూర్తాల జాతర
మనోరంజని ప్రతినిధి మార్చి 25 – ఏప్రిల్ నెలలో ఏకంగా 9 పెళ్లి ముహూర్తాలు ఉన్నట్లు పండితులు చెబుతున్నారు. ఒకే నెలలో ఇన్ని మంచి రోజులు ఉండడం చాలా అరుదు. ఏప్రిల్ 1 నుంచి 13 వరకు మూఢాలు. ఈ సమయంలో ఎలాంటి శుభకార్యాలు నిర్వహించరు. ఆ తర్వాత 9 ముహూర్తాలు ఉన్నాయి. ఏప్రిల్ 14, 16, 18, 19, 20, 21, 25, 29, 30 తేదీల్లో ముహూర్తాలు ఉండటంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో వేలాది వివాహాలు జరగనున్నాయి