

వందేభారత్ ప్రయాణికులకు గుడ్ న్యూస్
వందేభారత్ ఎక్స్ప్రెస్ రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులకు భారతీయ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది.. ఇకనుంచి తమ ప్రయాణ సమయంలో చిప్స్, శీతల పానీయాలు, బిస్కెట్లు, ఇతర ప్యాక్ చేసిన ఆహార పదార్థాలను ప్రయాణికులు ఆస్వాదించవచ్చని.. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) పేర్కొంది..గోరఖ్పూర్-అయోధ్య-లక్నో-ప్రయాగ్జ్ వందే భారత్ ఎక్స్ప్రెస్తో ఈ కొత్త సేవ అధికారికంగా ప్రారంభించినట్లు రైల్వే అధికారులు తెలిపారు