వంతెన నిర్మించాలని గ్రామస్తుల ఆందోళన
మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 04 :-నిర్మల్ జిల్లా ముధోల్ మండలం బోరేగాం నుండి కారేగాం ఎక్స్ రోడ్ మధ్యలో గల లో లెవెల్ వంతెనపైన బ్రిడ్జి నిర్మించాలని బోరేగాం గ్రామస్తులు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ వర్షాకాలంలో కొద్దిపాటి వర్షానికి లో లెవెల్ వంతెన పైనుండి వర్షపు నీళ్లు ప్రవహించడంతో గ్రామస్తులతో పాటు ప్రతిరోజు ప్రయాణించే వాహనదారులు నానా అవస్థలకు గురవుతున్నారన్నారు. ముధోల్ నుండి లోకేశ్వరం మండలం పంచ గుడి వరకు రోడ్డు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే లో లెవెల్ వంతెన వద్ద యధావిధిగాని కాంట్రాక్టర్ పనులు చేపట్టడానికి సిద్ధపడటంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షాకాలంలో ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని బ్రిడ్జిని నిర్మించే వరకు పనులను నిలిపివేయాలని పేర్కొన్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న రోడ్లు భవనాల శాఖ డిఈఈ వాగ్మరే సునీల్ కుమార్ గ్రామస్తులతో మాట్లాడారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు తమ వంతుగా కృషి చేస్తామని అన్నారు. దీంతో గ్రామస్తులు శాంతించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఎర్రం అమృత మురళి, మాజీ ఎంపీటీసీలు పండరి, గైని భోజన్న, గ్రామస్తులు లక్ష్మణ్, అనిల్, సాయిరెడ్డి, సాయి, సాయిబాబా, భోజన్న, చిన్నారెడ్డి, అంజయ్య, పీరాజీ, సాయి కిరణ్, రామ్ సేన యూత్, భగత్ సింగ్ యూత్, కిసాన్ యూత్ సభ్యులు, గ్రామస్తులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు