

లక్షలాది మందితో వరంగల్ సభ: హరీశ్
TG: వరంగల్లో బీఆర్ఎస్ నిర్వహించే బహిరంగ సభకు లక్షలాదిగా తరలి రావాలని బీఆర్ఎస్ నేత హరీశ్ రావు పిలుపునిచ్చారు. తెలంగాణ చరిత్రలో నిలిచిపోయేలా సభ నిర్వహిస్తామని వెల్లడించారు. బీఆర్ఎస్ యవ్వనంలోకి ప్రవేశిస్తోందన్న హరీశ్.. అధికార పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని పార్టీ శ్రేణులకు సూచించారు. రేవంత్ పాలనలో రైతులు అరిగోసలు పడుతున్నారని హరీశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.