

రోడ్డు ప్రమాదం లో కుబీర్ యువకుడు మృతి
మనోరంజని ప్రతినిధి తానుర్ మార్చి 16 :- నిర్మల్ జిల్లా తానుర్ మండలంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కుబీర్ మండల కేంద్రానికి చెందిన సగ్గం నరేష్ మృతి చెందినట్లు తానుర్ ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. ఎస్సై స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కుబీర్ కు చెందిన నరేష్ తానుర్ సమీపంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణం చేస్తున్న స్పీడ్ బ్రేక్ వద్ద అదుపు తప్పి ముందున్న ద్విచక్ర వాహనాన్ని డీ కొనడంతో నరేష్ కు తలకు తీవ్ర గాయాలై మృతి చెందినట్లు ఎస్సై పేర్కొన్నారు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఘటన పై విచారణ దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు
