

రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి తీవ్రగాయాలు
మనోరంజని ప్రతినిధి భైంసా ఏప్రిల్ 04 :- నిర్మల్ జిల్లా భైంసా మండలంలోని దేగాం గ్రామ సమీపంలోని హరియాలీ కన్వెన్షన్ వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం భైంసా – బాసర జాతీయ రహాదారిపై హరియాలీ కన్వెన్షన్ వద్ద ముందున్న ట్రాక్టర్ యూటర్న్ చేస్తుండగా అదే సమయంలో దేగాం వైపు ప్రయాణీకులతో వెళ్తున్న ఆటో ఢీ కొట్టింది. ఆటోలో ప్రయాణిస్తున్న ఆకాశ్, సాయి, చంద్రకాంత్, గంగాధర్, శివలింగుకు తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రులను 108 అంబులెన్సులో భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు.


