

రోడ్డు ప్రమాదంలో అమెరికన్ పాప్ సింగర్ మృతి
అమెరికా పాప్ సింగర్ ఎంజీ స్టోన్ (63) కారు ప్రమాదంలో మరణించారు. శనివారం తెల్లవారు జామున అలబామా నుంచి అట్లాంటాకు తిరిగి వస్తుండగా ఎంజీ స్టోన్ కారు అదుపుతప్పి మరొక వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్టోన్ అక్కడికక్కడే మృతి చెందగా, ఆమెతో పాటు కారులో ప్రయాణిస్తున్న ఏడుగురు గాయాలతో బయటపడ్డారు. కాగా ఎంజీ స్టోన్ మూడుసార్లు గ్రామీ అవార్డుకు నామినేట్ అయ్యారు..