

రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన
మనోరంజని ప్రతినిధి సారంగాపూర్ మార్చి 27:- నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంని కౌట్ల బి శాంతినగర్ నుండి పెద్దమ్మ గుడి వరకు 30 లక్షల తో రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన జరిగింది మండల బిజెపి నాయకులు సాదు రామ్ రెడ్డి సత్యపాల్ రెడ్డి మాట్లాడుతూ రోడ్డు అభివృద్ధి గ్రామ ప్రజలకు అనేక ప్రయోజనాలు అందించనున్నదని రైతులకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో మండల బిజెపి నాయకులు రాజారెడ్డి వంగ దయాకర్ రెడ్డి మంద నరసయ్య భీమన్న పున్న సాయందర్ ఆడే ప్రభాకర్ రవి గోవింద్ చిన్న రాజారెడ్డి బుజ్జన్న మరియు బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.