

రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్
రైల్వే ప్రయాణికులకు సౌత్ సెంట్రల్ రైల్వే శుభవార్త చెప్పింది. మార్చి 14న హోలీ పండుగ సందర్భంగా హైదరాబాద్ చర్లపల్లి నుంచి ఒడిశాలోని భువనేశ్వర్‌కు రెండు ప్రత్యేక రైళ్లు (08479, 08480) నడపనున్నట్లు ప్రకటించింది. 08480 నెంబరు రైలు మార్చి 11,18,25 తేదీలలో చర్లపల్లిలో ఉదయం 9.50 గంటలకు బయలుదేరుతుందని అలాగే రైలు (08479) మార్చి 10, 17, 24 తేదీలలో భువనేశ్వర్ నుంచి చర్లపల్లి మధ్య ప్రయాణిస్తోందని వెల్లడించింది.