

రైతు రుణమాఫీపై సభలో మాటల యుద్ధం
తెలంగాణ : అసెంబ్లీలో రైతు రుణమాఫీపై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేశామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. దీనిపై బీఆర్ఎస్ సభ్యులు అభ్యంతరం తెలిపారు. సగం మందికి కూడా మాఫీ జరగలేదన్నారు. దీంతో రైతుల వివరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామంటూ జిల్లాల వారీగా ఎన్నికోట్ల మాఫీ జరిగిందో భట్టి చదివి వినిపించారు