

రైతుల అభ్యున్నతికి పాటుపడుతున్న ప్రభుత్వం
కాంగ్రెస్ సీనియర్ నాయకులు ప్రేమ్నాథ్ రెడ్డి
మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 20 :- రాష్ట్ర ప్రభుత్వం రైతుల అభ్యున్నతికి పాటుపడుతున్నదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రేమ నాథ్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో రైతు భరోసా- సన్నం వడ్లకు బోనస్- ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా కు భారీగా నిధులు కేటాయించి ప్రజలకు ఇచ్చిన హామీను నిలబెట్టుకుందన్నారు. రైతులకు రెండు లక్షల లోపు రుణమాఫీని విజయవంతం చేసిందని పేర్కొన్నారు. అదేవిధంగా సన్నం వడ్లకు బోనస్ సైతం ఇచ్చి రైతు ప్రభుత్వంగా ముందుకు వెళ్తుందని తెలిపారు. రైతులకు అన్ని విధాల అండగా ఉంటూ వారి అభివృద్ధి ధ్యేయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో సైతం ప్రభుత్వం రైతులను రాజు చేయడమే ధ్యేయంగా ముందుకెళుతుందన్నారు