రేషన్ డీలర్ల కమిషన్ల నిధులను విడుదల చేయండి :ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి

రేషన్ డీలర్ల కమిషన్ల నిధులను విడుదల చేయండి :ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి

శాసనమండలిలో మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి

మనోరంజని రంగారెడ్డి జిల్లా ప్రతినిథి మార్చ్ 15 : గత మూడు నెలలుగా కమిషన్ల నిధులు రాక రాష్ట్రవ్యాప్తంగా రేషన్ డీలర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి శనివారం శాసనమండలిలో రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. రూ. 70 కోట్లకు పైగా నిధులు బకాయిలు ఉన్నాయని, ఇటీవలనే చేగుంటలో రేషన్ డీలర్ ప్రభాకర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని, నిధులను తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కాంగ్రెస్ రేషన్ డీలర్లకు 5000 వేతనం, 300 కమిషన్ ఇస్తామని ఎన్నికల సమయం చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. గురుకుల పాఠశాలలో విద్యార్థుల అవస్థలు కొనసాగుతూనే ఉన్నాయని, విద్యార్థులు అనారోగ్యాల బారినపడి చెందుతున్నారని, ఫుడ్ పాయిజన్ అయ్యి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సభ దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం గురుకుల పాఠశాలల పురోగతిపై దృష్టి సారించాలని సూచించారు. గురుకుల పాఠశాలలో ముఖ్యంగా పేద విద్యార్థులు చదువుతారనే విషయాన్ని గ్రహించి, వాళ్లకు పౌష్టికాహారాన్ని ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని నవీన్ రెడ్డి సూచించారు

  • Related Posts

    ఎలికట్ట భవాని మాత దేవాలయ పూజారి శివ శంకర్ భవాని ప్రసాద్ కు సర్ సివి రామన్ అకాడమీ ద్వారా గుర్తింపు

    ఎలికట్ట భవాని మాత దేవాలయ పూజారి శివ శంకర్ భవాని ప్రసాద్ కు సర్ సివి రామన్ అకాడమీ ద్వారా గుర్తింపు శివశంకర భవాని ప్రసాద్ కు పురోహిత వైభవ ప్రవీణ బిరుదు ప్రధానం మనోరంజని రంగారెడ్డి జిల్లా ప్రతినిథి మార్చ్…

    హైదరాబాద్ వాసులకు హెచ్చరిక.. బయట అస్సలు తిరగకండి..

    హైదరాబాద్ వాసులకు హెచ్చరిక.. బయట అస్సలు తిరగకండి.. ఏప్రిల్ ఎండలు మండు అని చదివే ఉంటారు. కానీ, మార్చి నెల మొదలైన నాటినుంచే ఎండలు దంచి కొడుతున్నాయి. బయట తిరగాలంటే బయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మధ్యాహ్నం పూట ఎండలు భగభగ మంటున్నాయి.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ఎలికట్ట భవాని మాత దేవాలయ పూజారి శివ శంకర్ భవాని ప్రసాద్ కు సర్ సివి రామన్ అకాడమీ ద్వారా గుర్తింపు

    ఎలికట్ట భవాని మాత దేవాలయ పూజారి శివ శంకర్ భవాని ప్రసాద్ కు సర్ సివి రామన్ అకాడమీ ద్వారా గుర్తింపు

    హైదరాబాద్ వాసులకు హెచ్చరిక.. బయట అస్సలు తిరగకండి..

    హైదరాబాద్ వాసులకు హెచ్చరిక.. బయట అస్సలు తిరగకండి..

    నాతో ఎంజాయ్ చేయ్, జాబ్ పర్మినెంట్ చేస్తా’..

    నాతో ఎంజాయ్ చేయ్, జాబ్ పర్మినెంట్ చేస్తా’..

    కులం కేన్సర్ వంటిది – మతం మహమ్మారి వంటిది .

    కులం కేన్సర్ వంటిది – మతం మహమ్మారి వంటిది .