

రేపు సింహాద్రి అప్పన్న కళ్యాణం
మనోరంజని ప్రతినిధి ఏప్రిల్ 07 -ప్రముఖ పుణ్య క్షేత్రం సింహాచలంలో శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవం రేపు అంగరంగ వైభవంగా జరగనుంది. ప్రతి ఏటా చైత్ర శుద్ధ ఏకాదశి పర్వదినాన స్వామివారి కళ్యాణాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈరోజు రాత్రి అంకురార్పణతో వేడుకలు ప్రారంభం కానున్నాయి. రేపు మధ్యాహ్నం కొట్నాల ఉత్సవం, ఎదురు సన్నాహం పూర్తవుతాయి. రాత్రి 8గంటలకు రథోత్సవం, 9.30గంటలకు స్వామి కళ్యాణ మహాత్సవం జరుగుతాయి.