రేపు నల్లమలకు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

రేపు నల్లమలకు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

దోపిడీ ముఠాకు ఇక దబిడి దిబిడే

అసెంబ్లీ ఎన్నికల తర్వాత మల్లన్న మొదటిసారి నాగర్ కర్నూల్ కు

మనోరంజని ప్రతినిధి మార్చి 27 – మహబూబ్ నగర్ :రేపు శుక్రవారం ఉ10:30 గంటలకు నాగర్ కర్నూల్ కు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న రాబోతున్నట్లు టీం రాష్ట్ర కమిటీ సభ్యులు రాష్ట్ర గోరంట్ల సతీష్ యాదవ్ పేర్కొన్నారు.నాగర్ కర్నూల్ జిల్లా పరిధిలో చిట్టిల వ్యాపారి నుండి మోసపోయిన బాధితుల పక్షాన రాబోతున్నాట్లు తెలిపారు.మోసకారి వెనుక ఉన్నది ఎవరు? ఎ రాజకీయ పార్టీ నాయకులు అండగా నిలిచారో వారి బాగోతలను కూడా బయట పెట్టబోతున్నాట్లు సమాచారం.అదేవిధంగా జిల్లాలోని టీం కమిటీ సభ్యులతో ప్రత్యేక సమావేశం కాబోతున్నట్లు తెలియజేశారు.ఈ సందర్భంగా నాగర్ కర్నూల్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల తీన్మార్ మల్లన్న టీం సభ్యులు అభిమానులు, పెద్ద మొత్తంలో హాజరుకావాలని గోరంట్ల సతీష్ యాదవ్ పిలుపునిచ్చారు.హోసింగ్ బోర్డులోని తీగల వెంకటస్వామి కన్వెన్షన్ హాల్ లో సమావేశం ఉంటుందని చెప్పారు. అయితే ఇదివరకు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో నాగర్ కర్నూల్ ప్రస్తుత ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డికి కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్గా తీన్మార్ మల్లన్న నాడు మద్దతు పలికారు. రాజేష్ రెడ్డి గెలుపులో కీలక పాత్ర పోషించారు.నాటి నుండి నాగర్ కర్నూల్ కు రావడం ఇదే మొదటి సారి

  • Related Posts

    కుంటాల మండల మున్నూరు కాపు సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక

    కుంటాల మండల మున్నూరు కాపు సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక మనోరంజని ప్రతినిధి కుంటాల మార్చి 30 :- నిర్మల్ జిల్లా కుంటాల మండలంలో మున్నూరు కాపు సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘ సభ్యుల సమావేశంలో తోట రఘు…

    ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లీ విగ్రహం వద్ద సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

    సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క,ట్రైకార్ చైర్మన్ తేజావత్ బెల్లయ్య నాయక్‌కు కృతజ్ఞతలు ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లీ విగ్రహం వద్ద సీఎం చిత్రపటానికి పాలాభిషేకం తెలంగాణ ప్రభుత్వం గోరు బోలి (లంబాడా) భాషను భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో చేర్చేందుకు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    కుంటాల మండల మున్నూరు కాపు సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక

    కుంటాల మండల మున్నూరు కాపు సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక

    మయన్మార్‌లో మళ్లీ భూకంపం.. పరుగులు పెట్టిన జనం..

    మయన్మార్‌లో మళ్లీ భూకంపం.. పరుగులు పెట్టిన జనం..

    కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి సంచలన వ్యాఖ్యలు

    కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి సంచలన వ్యాఖ్యలు

    ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లీ విగ్రహం వద్ద సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

    ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లీ విగ్రహం వద్ద సీఎం చిత్రపటానికి పాలాభిషేకం