

రేపటి నుంచి 10వ తరగతి పరీక్షలు షురూ
మనోరంజని ప్రతినిధి భూపాలపల్లి జిల్లా: మార్చి 20 – తెలంగాణ పదో తరగతి పరీక్షలు ఈనెల 21 నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు జరగనున్నాయి, ఈ పరీక్షల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది,పరీక్షలు నిర్వహణకు సంబంధించి హాల్ టికెట్లను కూడా పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో తీసుకు వచ్చింది, మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు జరిగే ఈ పరీక్షలకు 5,09403 మంది విద్యార్థు లు హాజరుకానున్నారు దీనికోసం 2,650 పరీక్ష కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది, ఆయా తేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఈ పరీక్షలు నిర్వ హించనుంది. తాజాగా ఎస్‌ఎస్‌సీ బోర్డు విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం.. మార్చి 21వ తేదీన ఫస్ట్ లాంగ్వేజ్, మార్చి 22వ తేదీన సెకండ్ లాంగ్వేజ్, మార్చి 24వ తేదీన ఇంగ్లీష్, మార్చి 26వ తేదీన మ్యాథ్స్, మార్చి 28వ తేదీన ఫిజిక్స్, మార్చి 29వ తేదీన బయాలజీ, ఏప్రిల్ 2వ తేదీన సోషల్ స్టడీస్ పరీక్షలు నిర్వహించను న్నారు. అలాగే.. ఏప్రిల్ 3న ఒకేషనల్ కోర్సు పేపర్-1 లాంగ్వేజ్ పరీక్ష, ఏప్రిల్ 4న ఒకేషనల్ కోర్సు పేపర్-2 లాంగ్వేజ్ పరీక్ష నిర్వహించ నున్నారు