రూ. 436 ప్రీమియంతో 2 లక్షల బీమా: పెద్దపల్లి కలెక్టర్
మనోరంజని ప్రతినిధి పెద్దపేలి మార్చి 11 :-
ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకు ద్వారా రూ. 436 ప్రీమియంతో రూ. 2 లక్షల బీమా లభిస్తుందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. మంగళవారం పెద్దపల్లి సమీకృత జిల్లా కలెక్టరేట్ లో తన చాంబర్ లో పీఎంజేజేబీవై పథకం కింద సంబంధిత కుటుంబ సభ్యులకు రూ. 2 లక్షల చెక్కును పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి లీడ్ బ్యాంకు మేనేజర్ వెంకటేష్, ఇండియన్ పోస్ట్ పేమెంట్ సీనియర్ మేనేజర్ కొట్టే శ్రీనివాస్ పాల్గొన్నారు.