రూ.3.22, 359,లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్
మనోరంజని ప్రతినిధి
అమరావతి :ఫిబ్రవరి 28
ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ను ఆర్థిక మంత్రి పయ్యావుల అసెంబ్లీ లో ప్రవేశపెట్టారు. నిర్ణయించిన ముహుర్తం ప్రకారం 10.08 గంటలకు మంత్రి బడ్జెట్ ప్రసంగంమొదలు పెట్టారు. ప్రభుత్వం ఏర్పడ్డాక కూటమి సర్కార్ తొలిసారి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టింది.
2025-26 ఆర్థిక సంవత్స రానికి 3,22,359, కోట్లతో ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టారు. రాష్ట్ర బడ్జెట్ తొలిసారి 3 లక్షలు కోట్లు దాటింది. సూపర్ సిక్స్, మేనిఫెస్టో హామీలకు, అభివృద్ధి పనులకు ఎక్కువ కేటాయింపులు జరపాల్సి రావడంతో 3 లక్షల కోట్లు దాటింది. రెవెన్యూ వ్యయం 251162 కోట్లు కాగా…
రెవెన్యూ లోటు 33185 కోట్లు ఉంది. ద్రవ్య లోటు 79926 కోట్లు ఉంది. మూల ధన వ్యయం 40635 కోట్లు గా ఉంది.
బడ్జెట్ ప్రవేశపెట్టిన సంద ర్భంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కీలక కామెంట్లు చేసారు. గత ప్రభుత్వ తప్పిదాలను, నిర్లక్ష్యాన్ని తీవ్రంగా ఎండ గట్టారు. వైసీపీ ప్రభుత్వ ఆర్థిక అరాచ కత్వాన్ని హిరోషిమాపై అణుదాడితో పోల్చారు. తమ పిల్లల భవిష్యత్ కోసం 2024 ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు అద్భుతమైన తీర్పు ఇచ్చారని వెల్లడించారు.
చంద్రబాబు తొలిసారి సీఎం అయినప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో పరిస్థితులు ఎంత దారుణంగా ఉండేవో ఇప్పుడూ అంతకు మించిన స్థాయిలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయన్నా రు. అప్పులు చేయడమే తప్ప అప్పులు తీర్చడాన్ని మరిచిన గత ప్రభుత్వ తప్పుడు విధానాలను సరి చేస్తున్నామని వ్యాఖ్యానిం చారు.
వైసీపీ పాలనలో కాంట్రాక్టర్లే రాష్ట్ర ప్రభుత్వాన్ని బ్లాక్ లిస్టులో పెట్టారని తెలి పారు. కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులు జరపక పోవ డంతో అభివృద్ధి పనులు చేయడానికి కాంట్రా క్టర్లు గత ప్రభుత్వంలో ముందు కు రాలేదన్నారు.
రెవెన్యూ వ్యయం అంచనా రూ.2,51,162 కోట్లుమూ లధన వ్యయం అంచనా రూ.40,635 కోట్లురెవెన్యూ లోటు రూ.33,185 కోట్లుద్ర వ్యలోటు రూ.79,926 కోట్లువ్యవసాయ, అను బంధ రంగాలకు రూ.13,4 87, కోట్లుపౌరసరఫరాల శాఖకు రూ.3,806 కోట్లుఎస్సీల సంక్షేమానికి రూ.20,281 కోట్లుఎస్టీల సంక్షేమానికి రూ.8,159 కోట్లు కేటాయించగా…
బీసీల సంక్షేమానికి రూ.47, 456 కోట్లుఅల్పసంఖ్యాక వర్గాల కోసం రూ.5,434 కోట్లుమహిళా శిశు సంక్షేమం, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమం కోసం రూ.4,332 కోట్లునైపుణ్యా భివృద్ధి శిక్షణ శాఖకు రూ.1,228 కోట్లుపాఠశాల విద్యాశాఖకు రూ.31,805 కోట్లుఉన్నత విద్యాశాఖకు రూ.2,506 కోట్లువైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమానికి రూ.19,264 కోట్లుతోపాటు….
పంచాయతీరాజ్ శాఖకు రూ.18,847 కోట్లుపు రపాలక, పట్టణాభివృద్ధి శాఖకు రూ.13,862 కోట్లుగృహనిర్మాణ శాఖకు రూ.6,318 కోట్లుజలవన రుల శాఖకు రూ.18,019 కోట్లుపరిశ్రమలు, వాణిజ్య శాఖకు రూ.3,156 కోట్లు ఇంధన శాఖకు రూ.13, 600 కోట్లుఆర్అండ్బీకి రూ.8,785 కోట్లుయువజన పర్యాటక, సాంస్కృతిక శాఖకు రూ.469 కోట్లు గృహ మంత్రిత్వశాఖకు రూ.8,570 కోట్లు.,..
తెలుగు భాష అభివృద్ధి, ప్రచారం కోసం రూ.10 కోట్లుమద్యం, మాదకద్ర వ్యాల రహిత రాష్ట్రం కోసం నవోదయ 2.0 కార్యక్రమా నికి రూ.10 కోట్లుఅన్నదాత సుఖీభవ కోసం రూ.6,300 కోట్లుపోలవరం కోసం రూ.6,705 కోట్లుజల్జీవన్ మిషన్ కోసం రూ.2800 కోట్లుతల్లికివందనం కోసం రూ.9,407 కోట్లు.