

రూపాయి రూపాయి కూడా కట్టుకొని… బాధితుడు జెస్సు అనిల్.
మనోరంజని చీఫ్ బ్యూరో:మార్చి 18 ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి టీచర్స్ కాలనీలో గతంలో ఉపాధ్యాయులు రూపాయి రూపాయి కూడా కట్టుకొని డబ్బులు జమచేసి లేఔట్ ఉన్నటువంటి భూమిలో ప్లాట్లను కొనుగోలు చేయడమైనది. ఈ ప్లాట్లను కొందరు అక్రమంగా భూ కబ్జాలను చేసి అక్రమంగానే అమ్మి వేయడం జరుగుతున్నది. కబ్జాదారులు లేఔట్ నెంబర్ 388/83లోని 74 మరియు 89 ప్లాటులు కబ్జా అవుతున్న విషయాన్ని గత సంవత్సరం ఇదే నెలలో అక్రమాన్ని గురవుతున్నాయని మున్సిపాలిటీ కమిషనర్ కు తెలియజేసినప్పటికీ వారు స్పందించకపోవడంతో మళ్లీ ఇదే నెల ఈ సంవత్సరం మరోసారి కమిషనర్ కి కబ్జా అయినా ప్లాట్లను కాపాడాలని వినతిపత్రం ఇవ్వడమైనది. కానీ వారు స్పందించకపోవడంతో మేము ఎంపి, ఎమ్మెల్యే, మరియు ఎమ్మెల్సీ లు ఉన్నప్పటికిని అధికారాన్ని దుర్వినియోగ పర్చకుండా శాంతియుతంగా అర్జీలు పెట్టుకొని న్యాయం చేయమని కోరిన న్యాయం చేయకపోవడంతో టీచర్స్ కాలనీ లోని మా ఫ్లాట్ నందు టెంటు వేసి నిరసన తెలియజేయడమైనది. ఎంపీ అరవింద్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అదే విధంగా ఎమ్మెల్సీలు ఈ విషయంలో స్పందించక ముందే సంబంధిత అధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరుతున్నాము. న్యాయం చేసే వరకు ఈ నిరసన విరమించేది లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము.