

రాములు నాయక్‌కు ఎమ్మెల్సీ అవకాశం కల్పించాలి – డిప్యూటీ సీఎం కు వినతిపత్రం
మనోరంజని ప్రతినిధి ఢిల్లీ మార్చి 01 :- శనివారం ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం నుండి మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్‌కు ఎమ్మెల్యే కోటా ద్వారా ఎమ్మెల్సీ అవకాశం కల్పించాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను గిరిజన సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేతావత్ బాబురామ్ నాయక్ కోరారు. రాములు నాయక్ లంబాడి సామాజిక వర్గానికి చెందిన ప్రముఖ నాయకుడిగా, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. గతంలో ఆయన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కాన్షీరామ్‌తో కలిసి అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. అలాగే, బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై కుటుంబ పాలనకు వ్యతిరేకంగా పోరాడి ఎమ్మెల్సీ పదవిని త్యాగం చేసి, కాంగ్రెస్‌లో చేరారు. ఇలాంటి ప్రజా నేతకు ఎమ్మెల్సీ పదవిని ఇవ్వడం ద్వారా గిరిజన సామాజిక వర్గానికి న్యాయం చేయాలని గిరిజన యువత, మేధావులు, మహిళలు కోరుతున్నారు. ఈ ప్రతిపాదనను బట్టి విక్రమార్క సానుకూలంగా స్వీకరించి, ఏఐసీసీ దృష్టికి తీసుకెళ్లి కచ్చితంగా చర్చిస్తానని హామీ ఇచ్చారు.

