

కామోల్ లో ప్రారంభమైన శ్రీరామనవమి ఉత్సవాలు
రాములవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే
మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 30 :- నిర్మల్ జిల్లా భైంసా మండలంలోని కామోల్ గ్రామంలో సీతారామచంద్రస్వామి ఆలయంలో ఉగాది పర్వదిన వేళ శ్రీరామనవమి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఆలయంలో తొమ్మిది రోజులపాటు ప్రత్యేక వేడుకలు జరగనున్నాయి. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ హాజరయ్యారు. గ్రామంలో శోభయాత్రలో పాల్గొని ఆలయాల్లో పూజలు నిర్వహించిన అనంతరం రాములోరికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. గ్రామంలో పెద్ద మొత్తంలో భక్తులు శ్రీరామ మాలాధారణ వేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గం ప్రజలందరికీ ఎమ్మెల్యే ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన వెంట పలువురు నాయకులు ఉన్నారు


