

రామగుండం: సిబ్బంది సమస్యల పరిష్కారంకే పోలీస్ దర్బార్: సీపీ
మనోరంజని ప్రతినిధి మార్చి 20 – సిబ్బంది సమస్యల పరిష్కారానికే పోలీస్ దర్భార్ నిర్వహిస్తున్నామని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. రామగుండం కమిషనరేట్ ఏఆర్ సిబ్బంది, అధికారులకు బుధవారం కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్ లో దర్బార్ నిర్వహించారు. సీపీ హాజరై ఏఆర్ పోలీస్ అధికారులు, సిబ్బంది సమస్యలను, వినతులను అడిగి తెలుసుకొని వెంటనే పరిష్కరించేలా చూస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ రాజు పాల్గొన్నారు