

రామగుండం ఎయిర్పోర్ట్ సాధ్యం కాదు: కేంద్రం
TG: పెద్దపల్లి(D) రామగుండంలో ఎయిర్పోర్టు ఏర్పాటు చేయాలని స్థానిక MP గడ్డం వంశీ చేసిన ప్రతిపాదనలపై కేంద్రం స్పందించింది. ‘ఇక్కడ ఎయిర్పోర్టు ఏర్పాటు సాధ్యం కాదు. చుట్టూ కొండలు, ఎయిర్స్పేస్పై IAF ఆంక్షలు ఉన్నాయి. ఇక్కడ గ్రీన్ ఫీల్డ్ ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిపాదనలు రాలేదు. ఒక వేళ ప్రభుత్వం నుంచి వస్తే పరిశీలిస్తాం’ అని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు MPకి రిప్లై ఇచ్చారు