

రానా, ప్రకాష్ రాజ్‌పై కేసు నమోదు..
మనోరంజని ప్రతినిధి హైదరాబాద్, మార్చి 20: – బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్న ఇన్‌ఫ్లుయెన్సర్లపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. టాలీవుడ్ సహా బాలీవుడ్ నటీనటుల వరకు అందరిపైనా చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు. ఈ క్రమంలోనే బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్న వారిపై వరుసగా కేసులు నమోదు చేస్తున్నారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో పలువురు బాలీవుడ్ నటులపై కేసులు నమోదు చేశారు. టాలీవుడ్‌కు సంబంధించి నటులు దగ్గుబాటి రానా, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్‌త పాటు మరికొందరిపై పోలీసులు కేసులు నమోదు చేశారు..