

రాజీవ్ యువ వికాస్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి
అర్హులకే పథకాలు ముమ్మరంగా కొనసాగుతున్న దరఖాస్తులు
ఆదివాసి కాంగ్రెస్ జిల్లా చైర్మన్ బాణావత్ గోవింద నాయక్
మనోరంజని ప్రతినిధి ఖానాపూర్ మార్చి 27 :- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజీవ్ యువ వికాస్ పథకాన్ని నిరుద్యోగ యువత యువకులు సద్వినియోగం చేసుకోవాలని ఆదివాసి కాంగ్రెస్ జిల్లా చైర్మన్ బాణావత్ గోవింద నాయక్ అన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ యువతి యువకులు స్వయం ఉపాధి కల్పించాలని దృడ సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువకులకు ఉపయోగకరంగా ఉంటుందని గ్రామాలలో ఉన్న యువతి యువకులు ఈ పథకాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి అవకాశం కలుగుతుందని రాజీవ్ యువ వికాస్ కి దరఖాస్తు చేసుకోవాలని వారు అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాట ఇచ్చింది అంటే నిలబెట్టుకుంటాదనీ వారు అన్నారు