

రాజీవ్ యువ వికాసం పథకాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలి
బీసీ సెల్ పట్టణ అధ్యక్షులు దొండి రమణ..
మనోరంజని, హైదరాబాద్ ప్రతినిధి:
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని బీసీ సెల్ పట్టణ అధ్యక్షులు దొండి రమణ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ యువతను ప్రోత్సహించేందుకు రాజీవ్ యువ వికాసం పేరిట సరికొత్త పథకాన్ని తీసుకువచ్చిందని అన్నారు. యువతను ప్రోత్సహించి వారి కాళ్లపై వారు నిలబడేందుకు అవసరమైన రుణాలను ఈ రాజీవ్ వికాసం పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అందజేయడం జరుగుతుందన్నారు. అర్హులైన నిరుద్యోగ యువత దరఖాస్తు చేసుకోవాలని దోండి రమణ సూచించారు. అర్హులైన వారికి జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా రుణాలను మంజూరు చేయడం జరుగుతుందన్నారు.
రూ.50 వేల లోపు రుణం తీసుకుంటే 100 శాతం సబ్సిడి.
- రూ.లక్ష లోపురుణంతీసుకుంటే 90 వేలు (10%) మాఫీ.
- రూ.2 లక్షల లోపు తీసుకుంటే రూ.60 వేలు (20%) మాఫీ.
- గ్రామీణ ప్రాంతాల వారి ఆదాయం రూ. 1.50 లక్షలు.
- అర్బన్ ఏరియాలో వారి ఆదాయం రూ.2 లక్షలు.
- వ్యవసాయేతర యూనిట్లకు 21-55 ఏండ్ల లోపు వారు అర్హులు.
వ్యవసాయం దరఖాస్తుదారులకు 60 పండ్ల వారు మాత్రమే అర్హులు.
ఏప్రిల్ 5వ తేదీ వరకు దారకాస్తు చేసుకునే అవకాశం కలదు. ఒక్కో లబ్ధిదారునికి 4 లక్షల వరకు రుణం మంజూరు చివరి తేదీ 05-04-2025,మంజూరు తేదీ 02-06-2025.ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కాంగ్రెస్ కార్యకర్తల దేనని ప్రజల మధ్యన ఉంటూ వారికి కావాల్సిన పథకాలను వివరిస్తూ ముందుకు వెళ్లాలని మన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఈరోజు కార్యకర్తలుగా ఉన్నవాళ్లే రేపు నాయకులూ అవుతారని ఆయన అన్నారు అలాగే ఆర్మూర్ నియోజకవర్గంలో చురుగ్గా పాల్గొంటున్న మన యువ నాయకుడు ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ప్రొద్దుటూరు వినయ్ కుమార్ అన్న గారి ఆధ్వర్యంలో యువత సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండాలని వాట్సప్ గ్రూపుల్లో లేనిపోనివి వీడియోలు ఫోటోలు పెట్టి ప్రజలను మతిభ్రమింపజేస్తున్న వాటిపై తొందరగా స్పందించాలని ఇంత మంచి పథకాలు ప్రజల వరకు చేరవేయవలసిన అవసరం ఎంతైనా ఉందని దొండి రమణ అన్నారు