

రాజకీయ లబ్ధి కోసమే కూటమి ప్రభుత్వంపై సుంకర పద్మశ్రీ విమర్శలు
9 నెలలు నిద్రపోయి, నేడు రాజకీయ ఉనికిని కాపాడుకోవడం కోసం హోంమంత్రి అనిత , ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు గారిపై సుంకర పద్మశ్రీ నిరాధార ఆరోపణలు
ప్రజా దర్బార్ నిర్వహణలో రాష్ట్రంలోనే ప్రధమ స్థానంలో నిలిచిన ఘనత యార్లగడ్డ వెంకట్రావు
రెండు సార్లు జాబ్ మేళా నిర్వహించి వేలల్లో నిరుద్యోగులకు యార్లగడ్డ వెంకట్రావు గారు ఉపాధి కల్పించారు.
గంజాయి, మాదకద్రవ్యాల స్మగ్లర్లపై హోంమంత్రి అనిత గారి అధ్యక్షతన స్థాపించిన ఈగల్ టాస్క్ ఫోర్స్ ఉక్కుపాదం
గతంలో వేల ఎకరాల్లో కన్పించిన గంజాయి సాగు నేడు 100 ఎకరాల్లోపునకు పరిమితం అయ్యేలా కూటమి ప్రభుత్వం చర్యలు
- మూల్పూరి సాయి కళ్యాణి, తెలుగు మహిళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.
హనుమాన్ జుంక్షన్, మార్చ్ 20: రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్ నాయకురాలు సుంకర పద్మశ్రీ నిరాధార విమర్శలు. 9 నెలలు నిద్రపోయి, నేడు రాజకీయ ఉనికిని కాపాడుకోవడం కోసం హోంమంత్రి అనిత , ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు గారిపై సుంకర పద్మశ్రీ నిరాధార ఆరోపణలు చేస్తున్నారని తెలుగు మహిళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మూల్పూరి సాయి కళ్యాణి మండిపడ్డారు. ఈ మెరకు గురువారం నాడు పత్రికా ప్రకటన విడుదల చేశారు.
ఈసందర్భంగా సాయి కళ్యాణి మాట్లాడుతూ, గన్నవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే వెంకట్రావు గారు కనపడట్లేదు అంటున్న పద్మశ్రీ, ఒకసారి ఆయన అధికారిక ఫేస్బుక్ పేజీని చుస్తే వాస్తవాలు తెలుస్తాయని సాయి కళ్యాణి సూచించారు. నియోజకవర్గ అభివృద్ధి, సంక్షేమం, పారిశ్రామిక పెట్టుబడుల కోసం ఒక పక్కా అధికారులతో సమావేశాలు నిర్వహిస్తూ కార్యరూపం దాల్చడానికి వెంకట్రావు గారు అహర్నిశలు కృషి చేస్తున్నారు. అందులో భాగంగానే మంగళవారం నాడు మల్లవల్లి పారిశ్రామిక కారిడార్లో నూతనంగా నిర్మించిన ప్రతిష్టాత్మక అశోక్ లేలాండ్ సంస్థ ప్రారంభోత్సవం అని తెలిపారు. ఎమ్మెల్యేగా వెంకట్రావు గారు ఎన్నికైన రోజు నుంచి వారంలో మంగళవారం, శుక్రవారం రోజులలో గన్నవరం నియోజకవర్గ కార్యాలయంలో, మిగతా రోజులలో విజయవాడ కార్యాలయంలో అర్ధరాత్రి సమయం వరకు ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలను తిరుస్తున్నారని పేర్కొన్నారు. పేద ప్రజల చికిత్స కొరకు సీఎంఆర్ఎఫ్ నిధులను సకాలంలో విడుదల చేస్తూ, అత్యవసరం సందర్భంలో సొంత నిధులు ఖర్చు చేస్తూ వెంకట్రావు గారు ఆదుకుంటున్నారు. పంచాయితీ నిధులతో గ్రామీణ ప్రాంతాల్లో సీసీ రోడ్లు నిర్మాణం వంటి అభివృద్ధి కార్యక్రమాలు యార్లగడ్డ గారు చేపట్టారాని తెలిపారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కోసం రెండు సార్లు జాబ్ మేళాలు నిర్వహించి వెలాదిమందికి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇపించారు. బుడమేరు వాగు పొంగిన సమయంలో లక్షల మంది ప్రజలకి ఆహారం అందించి, కంటి మీద కునుకు లేకుండా సాధారణ స్థితికి చేరుకునే వరకు వెంకట్రావు గారు ప్రజలకు అందుబాటులో ఉన్నారు. అకాల వర్షాల కారణంగా ముంపుకు గురైన పంటలను క్షేత్రస్థాయిలో వెంకట్రావు గారు పర్యటించి రైతులకు నష్టపరిహారం అందించి ఆదుకున్నారు. ఇన్ని చేసిన యార్లగడ్డ వెంకట్రావు గారు, నియోజకవర్గంలో కనపడట్లేదని సుంకర పద్మశ్రీ అనడం హాస్యాస్పదంగా ఉందని సాయి కళ్యాణి తెలిపారు.
గంజాయి సాగు, రవాణా, స్మగ్లర్లపై ఇప్పటికే హోంమంత్రి అనిత గారి అధ్యక్షతన ఈగల్ టాస్క్ ఫోర్స్ ను స్థాపించి ఉక్కుపాదం మోపుతున్నారని సాయి కల్యాణీ పేర్కొన్నారు. గతంలో వేల ఎకరాల్లో కన్పించిన గంజాయి సాగు నేడు బహుముఖ వ్యూహంతో సాంకేతిక సాయంతో 100 ఎకరాల్లోపునకు పరిమితం అయ్యేలా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టారని తెలిపారు. ఈ కేసుల్లో విచారణ వేగంగా పూర్తిచేయించి, నిందితులకు శిక్షలు పడేలా చూసేందుకు విశాఖపట్నం, రాజమహేంద్రవరం, విజయవాడ, గుంటూరు, తిరుపతిల్లో ప్రత్యేకంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని, డ్రగ్స్, గంజాయి ముఠాలపై సమాచారం ఇచ్చేందుకు, ఫిర్యాదులు చేసేందుకు 24 గంటల టోల్ ఫ్రీ నంబర్ 1972ను ఏర్పాటు చేశారని తెలిపారు. నియోజకవర్గంలో హింసాత్మక ఘటనలు లేకుండా ప్రజలు ప్రశాంత జీవనం కొనసాగిస్తున్నారని, ఏదైనా ఘటన జరిగిన గంటల్లోనే పోలీసులు కేసుని ఛేదించి నింధితులను పట్టుకుంటూ, పోలీసులు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. ఇకనుంచైన వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని సుంకర పద్మశ్రీకి సాయి కళ్యాణి సూచించారు