రాజకీయ పార్టీల ప్రతినిధులకు అవగాహన కల్పించిన జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్

రాజకీయ పార్టీల ప్రతినిధులకు అవగాహన కల్పించిన జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్

మనోరంజని ప్రతినిధి నిర్మల్ మార్చి 20 :- రాజకీయ పార్టీల ప్రతినిధులందరూ ఎన్నికల సంఘం నిబంధనలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పలు రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికలకు సంబంధించిన అన్ని నియమాలు, ఎన్నికల ప్రక్రియపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. రాజకీయ పార్టీలు బూత్ లెవల్ ఎజెంట్లుగా నియమించుకోవాలని, ఎజెంట్ల బాధ్యతలు, హక్కులను తెలియజేయాలని సూచించారు. ఫారం 6, 7, 8 లకి సంబంధించి దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతుందన్నారు. ఓటరు జాబితాలో ఉన్న తప్పులను సరిదిద్దుకునే అవకాశం కల్పించడం జరిగిందని, ఓటర్లు తమ పేరు, చిరునామా, తదితర వివరాలు సవరించుకుకోవాలనుకుంటే తహసిల్దార్, మున్సిపల్, ఆర్డీఓ కార్యాలయాల్లో తమ దరఖాస్తులను ఇవ్వవచ్చునన్నారు. నూతన ఓటర్ల నమోదు ప్రక్రియ కొనసాగుతుందని, 18 సంవత్సరాల వయసు నిండిన ప్రతి ఒక్కరిని తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఒకే ఓటరు ఇతర చోట్ల ఓటు హక్కు ఉన్న, నకిలీ ఓటర్ల ఏరివేత ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని తెలిపారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు జిల్లా యంత్రాంగం తీసుకునే చర్యల్లో రాజకీయ పార్టీలు సహకరించాలని కలెక్టర్ కోరారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, ఆర్డీఓ రత్నకళ్యాణి, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు శ్రీనివాస్, బిజెపి, టిడిపి, వైఎస్సార్ సిపి, ఎంఐఎం ఆమ్ ఆద్మీ పార్టీల ప్రతినిధులు కొరిపెల్లి శ్రావణ్ రెడ్డి, రమేష్, నరేష్, మజార్, షేక్ హైదర్ లు, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు





  • Related Posts

    రాజ్యాంగ నిర్మాతకు అవమానం

    రాజ్యాంగ నిర్మాతకు అవమానం మనోరంజని ప్రతినిధి గోదావరి జిల్లా: మార్చి 23 – తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండలం దూబచర్ల గ్రామ శివారు గాంధీ నగర్ కాలనీలోని రహదారి పక్కన ఉన్న అంబేద్కర్ విగ్రహానికి గుత్తి తెలియని వ్యక్తులు చెప్పుల…

    న్యాయమూర్తులకు న్యాయం ఇదేనా!

    న్యాయమూర్తులకు న్యాయం ఇదేనా! -ఈ న్యాయం అంటే ఏమిటి…? -డా. మొగుల్ల భద్రయ్య, జాతీయ ప్రధాన కార్యదర్శి జాతీయ మానవ హక్కుల కమిటీ (NHRC) కామన్ మాన్ వాయిస్: మనోరంజని ప్రతినిధి మార్చి 23 – ఇటీవలి కాలంలో మన న్యాయ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ఉగాది ఈ నెల 30 న శ్రీవిశ్వావసు నామ సంవత్సరం!!!

    ఉగాది ఈ నెల 30 న శ్రీవిశ్వావసు నామ సంవత్సరం!!!

    మే నుంచే కొత్త పింఛన్లు– శుభవార్త చెప్పిన మంత్రి

    మే నుంచే కొత్త పింఛన్లు– శుభవార్త చెప్పిన మంత్రి

    రాజ్యాంగ నిర్మాతకు అవమానం

    రాజ్యాంగ నిర్మాతకు అవమానం

    న్యాయమూర్తులకు న్యాయం ఇదేనా!

    న్యాయమూర్తులకు న్యాయం ఇదేనా!