రవీంద్రభారతిలో నేడు వారికి నియామకపత్రాలు అందించనున్న సీఎం..!!
హైదరాబాద్: జూనియర్ లెక్చరర్లు, పాలిటెక్నిక్ లెక్చరర్లుగా ఎంపికైన అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు రవీంద్రభారతిలో నియామక పత్రాలు అందజేయనున్నారు.జేఎల్ పోస్టుల భర్తీకి 2023లో పరీక్షలు నిర్వహించారు. అవి గత ఏడాది ఫలితాలు విడుదలయ్యాయి. పాలిటెక్నిక్ లెక్చరర్ల పోస్టులకు 2023లోనే పరీక్షలు నిర్వహించారు. జూనియర్ లెక్చరర్ గా 1,290, పాలిటెక్నిక్ లెక్చరర్లుగా 240 మంది ఎంపికైనట్లు అధికారులు తెలిపారు