రబింద్రాలో తెలంగాణ ఉద్యమకారుల పుస్తక పరిచయం

రబింద్రాలో తెలంగాణ ఉద్యమకారుల పుస్తక పరిచయం

మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 12 :- నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రమైన ముధోల్లోని రబింద్ర ఉన్నత పాఠశాలలో ప్రముఖ కవులు జాదవ్ పుండలిక్ రచించిన తెలంగాణ ఉద్యమకారులు అనే పుస్తక పరిచయం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ పుస్తకం ఇటీవల ఆవిష్కరించారు. ఈ పుస్తక పరిచయ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ముధోల్ సబ్ ఇన్స్పెక్టర్ సంజయ్, గురుకృప ఒకేషనల్ కళాశాల డైరెక్టర్ ముష్కం రామకృష్ణ గౌడ్, కవులు బసవరాజు, రెడ్ల బాలాజీ, పీసర శ్రీనివాస్ గౌడ్, ఉద్యమకారులు దిగంబర్, అజయ్, చంద్రకాంత్, సాయి ప్రసాద్ హాజరయ్యారు. విద్యార్థులకు తెలంగాణ చరిత్రను, తెలంగాణ ప్రజల పోరాటపటిమను, విద్యార్థుల మేధావుల త్యాగాలను వివరించారు. తదనంతరం పాఠశాల ప్రిన్సిపల్ అసంవార్ సాయినాథ్ మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు మా పాఠశాలలో జరపడం చాలా అదృష్టమని దేశంలోకెల్లా అన్ని రాష్ట్రాల్లో కంటే తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకమని నిజాముల నుండి ఆంధ్రుల దాకా 1969 నుండి 2014 వరకు ఎంతో పోరాటం చేసి సాధించుకున్నదని, ఎందరో వీరులు ప్రాణ త్యాగాలు చేశారని పేర్కొన్నారు. స్వరాష్ట్ర సాధనలో యువకులు ఆత్మ బలిదానాలు చేశారని అన్నారు. తెలంగాణలోని ఆబాలగోపాలం ఉద్యమించారని, వేల మంది విద్యార్థులు తెలంగాణ తల్లి కోసం రక్త తర్పణాలు చేశారని తత్పలితంగా 2014లో ప్రత్యేక తెలంగాణ సాధించుకున్నామని వెల్లడించారు. ఇలాంటి వీరుల తెలంగాణ ఉద్యమకారుల చరిత్రను తెలంగాణ ఉద్యమకారులు అనే పుస్తకంలో పొందపరచి, తెలంగాణ చరిత్రను అందరికీ తెలిసేలా కృషిచేసిన జాదవ్ పండలిక్-సహ సంపాదకులకు-పుస్తకం రాయడానికి సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అతిథులను పాఠశాల యాజమాన్యం కరస్పాండెంట్లు పోతన్న యాదవ్, రాజేందర్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు

  • Related Posts

    నేడు కేంద్రమంత్రి జై శంకర్ తో సీఎం రేవంత్ రెడ్డి!

    నేడు కేంద్రమంత్రి జై శంకర్ తో సీఎం రేవంత్ రెడ్డి! మనోరంజని ప్రతినిధి హైదరాబాద్:మార్చి 13 -ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం ఢిల్లీలో విదేశా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జై శంకర్,తో బేటి కానున్నారు ఇందుకోసం బుధవారం సాయంత్రం ఆయన…

    మతసామరస్యాలకు ప్రతీక రంజాన్ మాసం : మురళీకృష్ణ యాదవ్

    మతసామరస్యాలకు ప్రతీక రంజాన్ మాసం : మురళీకృష్ణ యాదవ్ జె.పి దర్గా ఇఫ్తార్ విందులో పాల్గొన్న బీ ఆర్ఎస్ యువ నాయకుడు వై. మురళీకృష్ణ యాదవ్ మనొరంజని రంగారెడ్డి జిల్లా ప్రతినిథి మార్చ్ 12 : తెలంగాణ సంస్కృతికి, మతసామరస్యానికి రంజాన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    అరుదైన మైలురాయిని అందుకున్న ఫోన్ పే

    అరుదైన మైలురాయిని అందుకున్న ఫోన్ పే

    నేడు కేంద్రమంత్రి జై శంకర్ తో సీఎం రేవంత్ రెడ్డి!

    నేడు కేంద్రమంత్రి జై శంకర్ తో సీఎం రేవంత్ రెడ్డి!

    తమిళనాడు డీఎంకే నేతలతో వైయస్ జగన్ భేటీ

    తమిళనాడు డీఎంకే నేతలతో వైయస్ జగన్ భేటీ

    మతసామరస్యాలకు ప్రతీక రంజాన్ మాసం : మురళీకృష్ణ యాదవ్

    మతసామరస్యాలకు ప్రతీక రంజాన్ మాసం : మురళీకృష్ణ యాదవ్