

రబింద్రాలో ఘనంగా విజ్ఞాన దినోత్సవం

మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 01 :- నిర్మల్ జిల్లా మండల కేంద్రమైన ముధోల్లోని రబింద్ర ఉన్నత పాఠశాలలో జాతీయ సైన్సు దినాన్ని ఘనంగా నిర్వహించారు. సుమారు 200 లకు పైగా నమూనాలను విద్యార్థులు ప్రదర్శించారు. అంతరిక్షానికి సంబందించినవి, వ్యవసాయ, శాస్త్ర సాంకేతిక వైజ్ఞానిక నమూనాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎస్ఐ సంజీవ్ కుమార్ హాజరయ్యారు. పిల్లలను ఎంతగానో అభినందించారు. పాఠశాల ప్రిన్సిపాల్ ఆసంవార్ సాయినాథ్ మాట్లాడుతూ సివి రామన్ జన్మదినాన్ని జాతీయ సైన్సు దినంగా జరుపుతారాని పేర్కొన్నారు. పాఠశాలలో సైన్సు పట్ల అవగాహన కల్గించి, విద్యార్థులో సృజనాత్మక శక్తిని వెలికితీయడానికి ఈ సైన్సు దినాన్ని ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహంసామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ రాజేందర్, చైర్మన్ భీంరావ్ దేశాయ్, డైరెక్టర్ పోతన్న యాదవ్, ఉపాద్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్కొన్నారు