

మనోరంజని ప్రతినిది భైంసా మార్చి 21 – నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో శుక్రవారం జి.డి.ఆర్ ఆసుపత్రిలో బల్గాం గ్రామానికి చెందిన సునీతకు వైద్యురాలు దీప జాదవ్ వైద్య పరీక్షలు నిర్వహించారు. రోగికి అత్యవసరంగా రక్తం అవసరమని తెలియడంతో బ్లడ్ డోనర్స్ గ్రూప్ వ్యవస్థాపకుడు సురేష్‌ను సమాచారం అందించారు. సురేష్ చర్యతో రక్తదాత సంజు వెంటనే స్పందించి రక్తనిది నిల్వ కేంద్రంలో రక్తదానం చేసి ప్రాణాలను కాపాడారు. ఈ సందర్భంగా సంజు మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని, దీనివల్ల అనేకమంది ప్రాణాలు నిలుపుకోవచ్చని అన్నారు. రక్తదాత సంజును ఆసుపత్రి నిర్వాహకులు, ఇతర పలువురు అభినందించారు. రక్తదానం చేయడం ద్వారా సామాజిక సేవలో భాగస్వామ్యం కావాలని, నిండు ప్రాణాలను కాపాడాలని ఆయన పిలుపునిచ్చారు.