

రంజాన్ ఏర్పాట్లను పరిశీలిస్తున్న పంచాయతీ కార్యదర్శి
మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 29 :-ముస్లింల పవిత్ర పండుగైన రంజాన్ కొరకు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో సకల ఏర్పాట్లు చేస్తున్నట్లు పంచాయతీ కార్యదర్శి అన్వర్ అలీ పేర్కొన్నారు. రంజాన్ రోజు ప్రార్థన చేసే స్థలమైన ఈద్గా పరిసర ప్రాంతాన్ని శుభ్రపరచడం జరిగింది. ఈద్గా వద్ద పారిశుద్ధ్య కార్మికులు నిర్వహిస్తున్న పనులు పరిశీలిస్తూనే గ్రామంలో జరిగే పనులను పర్యవేక్షిస్తున్నారు. గ్రామ ప్రజల సమస్యల ఫిర్యాదులు అందగానే వెనువెంటనే స్పందిస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ముఖ్యంగా ఎండాకాలం అయినందున ఎక్కడ నీటి ఇబ్బందులు ఏర్పడకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. అదేవిధంగా మురికి కాలువలను శుభ్రం చేయడం, చెత్తని సేకరించి డంపింగ్ యార్డ్ లకు తరలించడం జరుగుతోంది. గ్రామంలో ఏమైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు