రంగు రాళ్ళ తవ్వకాలకు నిబంధనలు పట్టవా…?

రంగు రాళ్ళ తవ్వకాలకు నిబంధనలు పట్టవా…?

మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 16 :- నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రమైన ముధోల్ లోని పాచవ్వ గుట్టలో రంగు రాళ్ల కోసం జరుపుతున్న తవ్వకాలకు నిబంధనలు పట్టవా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. తవ్వకాల కోసం అనుమతి తీసుకున్న సదరు కాంట్రాక్టర్ నిబంధనలు పాటించడం లేదని చుట్టుపక్కల ఉన్న రైతులు వాపోతున్నారు. అదేవిధంగా పరిమితికి మించి వాహనాల్లో రాళ్లను తరలిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మైనింగ్ శాఖ అధికారులు విధిగా తనిఖీలు నిర్వహించాల్సి ఉండగా నామమాత్రం గానే తనిఖీలు చేపడుతున్నారని పలువురు పేరుకొంటున్నారు. తవ్వకాలు జరుపుతున్నచోట భారీగా గుంతలు ఏర్పడుతున్నాయి. వర్షాకాలంలో గుంతల్లో నీళ్లు చేరి ప్రమాదానికి నేలువుగా మారుతున్నాయని పలువురు పేర్కొంటున్నారు. చుట్టుపక్కల ఉన్న రైతులతో పాటు పశువుల కాపర్లు తమ పశువులను అటువైపు మేపడానికి వెళ్లే సమయంలో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు. మైనింగ్ శాఖ అధికారులు స్పందించి విస్తృతంగా తనిఖీలు నిర్వహించాలని పలువురు కోరుతున్నారు

  • Related Posts

    విద్యుత్ బకాయిలను విడుదల చేయాలని పొన్నం ప్రభాకర్ ను కోరిన ➖ కోలిపాక లక్ష్మణ్

    విద్యుత్ బకాయిలను విడుదల చేయాలని పొన్నం ప్రభాకర్ ను కోరిన ➖ కోలిపాక లక్ష్మణ్

    సోషల్ మీడియా కోఆర్డినేటర్ ని పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

    సోషల్ మీడియా కోఆర్డినేటర్ ని పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు రామడుగు మండలం కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ జవ్వాజి అజయ్ ఇటీవల బైక్ నుండి కింద పడగా కాలు కీ గాయం కాగా ఆదివారం రోజున రామడుగు మండలం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    అమెరికాలో రోడ్డు ప్రమాదం

    అమెరికాలో రోడ్డు ప్రమాదం

    ఏపీలో నేటి నుంచి పదో తరగతి పరీక్షలు

    ఏపీలో నేటి నుంచి పదో తరగతి పరీక్షలు

    విద్యుత్ బకాయిలను విడుదల చేయాలని పొన్నం ప్రభాకర్ ను కోరిన ➖ కోలిపాక లక్ష్మణ్

    విద్యుత్ బకాయిలను విడుదల చేయాలని పొన్నం ప్రభాకర్ ను కోరిన ➖ కోలిపాక లక్ష్మణ్

    బాలాజీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో దారుణం

    బాలాజీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో దారుణం