యూడిఐడి కార్డుల అర్హుల కార్డుల పంపిణికి చర్యలు తీసుకుంటున్నాం .. జిల్లా కలెక్టర్

యూడిఐడి కార్డుల అర్హుల కార్డుల పంపిణికి చర్యలు తీసుకుంటున్నాం .. జిల్లా కలెక్టర్

మనోరంజని ప్రతినిధి నిర్మల్ మార్చి 27 :- జిల్లాలో ప్రత్యేక వైకల్య గుర్తింపు కార్డుల (యూడిఐడి కార్డుల) పంపిణీ కోసం అర్హుల ఎంపిక ప్రక్రియను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. గురువారం హైదరాబాదు నుంచి సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్, పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి సెక్రటరీ లోకేష్ కుమార్ తో కలిసి జిల్లాల కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులతో యుడిఐడి కార్డులు, ఇందిరా మహిళా శక్తి పెట్రోల్ బంకుల ఏర్పాటు, ప్రమాద బీమా మంజూరు, ఏకరూప దుస్తుల తయారీ, తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు. సెర్ప్ సీఈఓ మాట్లాడుతూ, అన్ని జిల్లాల్లో ప్రత్యేక వైకల్య గుర్తింపు కార్డులను జారీ చేసేందుకై అర్హుల గుర్తింపు ప్రక్రియను ప్రారంభించాలన్నారు. యుడిఐడి కార్డులను పొందేందుకై దివ్యాంగులకు నమోదు చేసుకునే విధంగా అవగాహన కల్పించాలన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులందరికీ ఏకరూప దుస్తులను పంపిణీ చేసేందుకై, ఎస్ హెచ్ జి సభ్యులచే ఏకరూప దుస్తుల తయారీ ప్రక్రియను ప్రారంభించాలన్నారు. ఇందిరా మహిళా శక్తి పెట్రోల్ బంకులు, విద్యుత్ వాహనాల ఛార్జింగ్ కేంద్రాలు, మహిళా శక్తి బజార్ లు ఏర్పాటు చేసేందుకు అనువైన స్థలాలను గుర్తించాలన్నారు. మహిళా శక్తి బజార్లలో ఆయా జిల్లాలలో స్థానికంగా తయారయ్యే లభ్యమయ్యే వస్తువులను, మహిళా సంఘాలచే తయారు చేయబడిన వస్తువులను ఒక చోటికి చేర్చి విక్రయించాలన్నారు. ప్రమాదవశాత్తు మరణించిన మహిళా సంఘాల సభ్యులకు సంబంధించిన భీమా డబ్బులను మంజూరు చేసే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ, యుడిఐడి కార్డుల మంజూరు కోసం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇప్పటికే నమోదు చేసుకున్న దివ్యాంగులకు సమాచారం అందించి, జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో యుడిఐడి కార్డుల నమోదు శిబిరాన్ని ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. యూడిఐడి కార్డుల ప్రక్రియపై సందేహాలను తొలగించేందుకు హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేశామన్నారు. మహిళా శక్తి పెట్రోల్ బంకులు, విద్యుత్ వాహనాల ఛార్జింగ్ కేంద్రాలు, ఏర్పాటు చేసేందుకై అనువైన స్థలాలను గుర్తించేందుకు చర్యలు తీసుకుంటామని వివరించారు. ఇప్పటికే ఇందిరా మహిళా బజార్ ఏర్పాటుకు సంబంధించి స్థల గుర్తింపు ప్రక్రియ పూర్తయిందని, ఇందిరా మహిళా బజార్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సంవత్సరం నుంచి ఐకెపికి అదనపు వరి కొనుగోలు కేంద్రాలను కేటాయించడంతో పాటు సిబ్బందికి శిక్షణను అందించనున్నామని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్లు పైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్ లు, ఆర్డీవో రత్నకళ్యాణి, ఇన్ ఛార్జ్ డిఆర్డిఓ శ్రీనివాస్, మెప్మా పీడీ సుభాష్, డిఎస్ఓ కిరణ్ కుమార్, డిఎం సివిల్ సప్లయిస్ వేణుగోపాల్, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు

  • Related Posts

    కుంటాల మండల మున్నూరు కాపు సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక

    కుంటాల మండల మున్నూరు కాపు సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక మనోరంజని ప్రతినిధి కుంటాల మార్చి 30 :- నిర్మల్ జిల్లా కుంటాల మండలంలో మున్నూరు కాపు సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘ సభ్యుల సమావేశంలో తోట రఘు…

    ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లీ విగ్రహం వద్ద సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

    సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క,ట్రైకార్ చైర్మన్ తేజావత్ బెల్లయ్య నాయక్‌కు కృతజ్ఞతలు ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లీ విగ్రహం వద్ద సీఎం చిత్రపటానికి పాలాభిషేకం తెలంగాణ ప్రభుత్వం గోరు బోలి (లంబాడా) భాషను భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో చేర్చేందుకు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    కుంటాల మండల మున్నూరు కాపు సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక

    కుంటాల మండల మున్నూరు కాపు సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక

    మయన్మార్‌లో మళ్లీ భూకంపం.. పరుగులు పెట్టిన జనం..

    మయన్మార్‌లో మళ్లీ భూకంపం.. పరుగులు పెట్టిన జనం..

    కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి సంచలన వ్యాఖ్యలు

    కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి సంచలన వ్యాఖ్యలు

    ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లీ విగ్రహం వద్ద సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

    ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లీ విగ్రహం వద్ద సీఎం చిత్రపటానికి పాలాభిషేకం