

యూట్యూబర్ హర్ష సాయిపై కేసు
TG: బెట్టింగ్ యాప్సు ప్రమోట్ చేస్తున్న యూట్యూబర్ హర్ష సాయిపై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. తాను ఎవరిపై వ్యక్తిగతంగా పోరాటం చేయడం లేదని, బెట్టింగ్ యాప్ ప్రమోషన్లకు వ్యతిరేకంగా పోరాడుతున్నట్లు సజ్జనార్ తెలిపారు. బెట్టింగ్ యాప్స్ వల్ల ఎంతో మంది నష్టపోతున్నారని, వీటిని నమ్మి మోసపోవద్దని ప్రజలకు సూచించారు