

యువత స్టాక్‌మార్కెట్లకు దూరంగా ఉండాలి: రాహుల్ గాంధీ
స్టాక్‌మార్కెట్లపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ సోమవారం కీలక వ్యాఖ్యలు చేశారు. యువత స్టాక్‌మార్కెట్లకు దూరంగా ఉండాలని రాహుల్ గాంధీ సూచించారు. స్టాక్ మార్కెట్ల నుంచి డబ్బులు సంపాదించడం భ్రమ అని ఆయన పేర్కొన్నారు. దేశ జనాభాలో కేవలం ఒక శాతం మాత్రమే స్టాక్‌మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నారని రాహుల్ అన్నారు. ప్రస్తుత సమయంలో స్టాక్‌మార్కెట్లకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని రాహుల్ తెలిపారు