

యువత గుండెను భద్రంగా కాపాడుకోవాలి
ప్రముఖ గుండె వ్యాధి నిపుణులు డాక్టర్ జగన్నాథం
ప్రస్తుతం మారుతున్న పరిస్థితుల దృశ్య యువత తమ గుండె ను పదిలంగా కాపాడుకోవాలని ఆదిత్య ఆసుపత్రి ప్రముఖ గుండె వ్యాధి నిపుణులు డాక్టర్ జగన్నాథం సూచించారు, ముఖ్యంగా యువత గుండె భద్రతపై నిర్లక్ష్యం చేయరాదని హెచ్చరించారు, ఛాతిలో నొప్పి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తితే తక్షణమే వైద్యులను సంప్రదించాలని తెలిపారు, మంచి ఆహారం వ్యాయామం తగిన సమయానికి నిద్రపోవడం వంటివి గుండెపోటు నివారణకు మార్గమని తెలిపారు, మోతాదుకు మించి ఆల్కహాల్ సేవించడం అధికంగా పొగ తాగడం కొవ్వు పదార్థాలను అధికంగా తీసుకోవడం గుండె పోటుకు కారణాలు అవుతాయని అన్నారు, 35 సంవత్సరాలు దాటిన వారు తప్పకుండా ఒకసారి గుండె పరిచయం చేసుకోవాలని సూచించారు,